
16 కిలోలతో తయారీ
యాదాద్రి, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నృసింహుడి ఆలయానికి బంగారు తలుపు అమర్చనున్నా రు. ఇందుకోసం 16 కిలోల బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. స్వర్ణ ద్వారానికి సంబంధించిన గ్రాఫిక్ వీడియోను వైటీడీఏ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టలో లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని పునర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలపాలన్న ఉద్దేశంతో చేస్తున్న నిర్మాణంలో బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయం గర్భాలయ ముఖ ద్వారానికి బంగారు తాపడం చేయనున్నారు. టేకుతో తయారు చేసిన తలుపులకు ఆలయానికి చెందిన 16 కిలోల బంగారాన్ని తాపడంగా ఉపయోగిస్తున్నారు. ఈ ద్వారాలపై స్వామివారి 14 చిత్రాలు చిత్రీకరిస్తున్నారు. 36 గంటలను ఏర్పాటు చేయడంతో పాటు 36 తామరపూలు, ఆరు హంసలను చిత్రీకరిస్తున్నారు. ఈ పనులు చెన్నైలో జరుగుతున్నాయి.
For More News..