
న్యూఢిల్లీ: స్థానిక మార్కెట్లలో డిమాండ్ తగ్గడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 200 తగ్గి రూ. 91,250కి చేరుకున్నాయని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం ప్యూరిటీ గల పది గ్రాముల పుత్తడి ధర సోమవారం రూ. 91,450 పలికింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.
200 తగ్గి రూ. 90,800కి చేరుకుంది. ఇది మునుపటి ముగింపులో 10 గ్రాములకు రూ. 91వేల వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో తగ్గిన తర్వాత వెండి ధరలు పుంజుకున్నాయి కిలోకు రూ. 200 పెరిగి కిలోగ్రాముకు రూ. 92,700కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ 0.82 శాతం పెరిగి ఔన్సుకు 3,007.60 డాలర్లకు చేరుకుంది.