Gold Rates Today: అస్సలు తగ్గట్లేదు.. హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rates Today: అస్సలు తగ్గట్లేదు.. హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ఎక్కడా తగ్గట్లేదు. భారత్లో రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్లు పడిపోతున్నా.. గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకి చేరుకుంటూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్లతో పాటు ఇండియాలో రిజర్వ్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు అన్నీ బంగారాన్ని కొంటుండటంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్ నడవడంతో పెట్టుబడులకు సేఫ్ అయిన గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా బ్యాంకులు పెద్ద మొత్తంలో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తున్నాయి.  గత రెండు నెలల్లో 10 గ్రాముల గోల్డ్ ధర దేశ రాజధానిలో 12 శాతం పెరిగి రూ.89,400 వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. 

ఇవాళ (మంగళవారం, ఫిబ్రవరి 18) హైదరాబాద్ లో బంగారం ధరలు:

24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.330 పెరిగి 86,950 కి చేరుకుంది. నిన్న (సోమవారం) రూ.86,620 వద్ద ఉంది.

22 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.300 పెరిగి 79,700 కి చేరుకుంది. నిన్న (సోమవారం) రూ.79,400 వద్ద ఉంది.

హైదరాబాద్ లో వెండి ధరలు:

వెండి ధరలు గత ఐదు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి 13న లక్షా 7 వేల రూపాయలు ఉన్న కిలో వెండి ధర, ఆ తర్వాత రోజు (14) వెయ్యి రూపాయలు పెరిగి అక్కడి నుంచి స్థిరంగా కొనసాగుతోంది. 1 కేజీ వెండి ధర హైదరాబాద్ లో 1,08,000 (1 లక్షా 8 వేలు) వద్ద ఉంది.