బట్టల దుకాణం గోడకు రంధ్రం వేసి..నగల దుకాణంలో చోరీ

బట్టల దుకాణం గోడకు రంధ్రం వేసి..నగల దుకాణంలో చోరీ

దొంగలు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. వినూత్న పద్దతుల్లో..విభిన్న మార్గాల్లో ..అందిన కాడికి బంగారం..డబ్బులు చోరీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ చందానగర్ లోని ఓ బంగారు దుకాణంలో చోరీ కలకలం రేపింది. అగంతకులు దుకాణం వెనుక భాగంలోని షాపులో నుంచి రంధ్రం చేసి చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు అపహరించారు. వివరాల్లోకి వెల్తే..

చందానగర్ గాంధీ విగ్రహం వెనకాల గల్లీలో రాజ్ లాల్ చంద్ పాన్ బ్రోకర్ జ్యువెలరీ షాపు ఉంది. అయితే జులై 31వ తేదీ అర్థరాత్రి ఈ షాప్ ను ఆనుకోని ఉన్న వస్త్ర దుకాణంలోకో చొరబడ్డ దొంగలు..ఆ దుకాణం గోడకు కన్నం వేసి నగల దుకాణంలోకి ప్రవేవించారు. షాపులో ఉన్న సుమారు 40 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న  చందా నగర్ పోలీసులు, క్లూస్ టీమ్‌లు ..సీసీ కెమెరాలను  పరిశీలిస్తున్నారు.