లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటి బంగారం ధర.. ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..

లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటి బంగారం ధర.. ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లక్ష దాటిపోయింది. ఇవాళ ఒక్కరోజే 3 వేలు పెరిగి 98 వేల 500 రూపాయల నుంచి లక్షా 15 వందలకు చేరింది. మన దేశంలో బంగారం ధర లక్ష దాటిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక.. హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం లక్షకు ఒక్క రూపాయి దూరంలో నిలిచింది.

హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర మంగళవారం (ఏప్రిల్ 22, 2025) 16 వందల 49 రూపాయలు పెరిగింది. దీంతో.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99 వేల 999 రూపాయలు పలికింది. అంటే.. తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలు చూసుకోవాల్సిందే. ఇక.. ఆంధ్రాలో కూడా బంగారం ధర లక్ష దాటింది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3 వేలు పెరిగి 98 వేల 350 రూపాయల నుంచి లక్షా 13 వందల 50 రూపాయలకు చేరింది.

24 క్యారెట్ల బంగారం మాత్రమే కాదు.. 22 క్యారెట్ల బంగారం కూడా భగ్గుమంటుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 92 వేల 9 వందలు, విశాఖపట్నంలో 92 వేల 900 పలికింది. డాలర్ విలువ పడుతుండడంతో పాటు, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో డాలర్‌‌కు డిమాండ్ పడిపోతోంది. ఇన్వెస్టర్లు డాలర్‌‌‌‌‌‌‌‌ కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు యూఎస్–-చైనా మధ్య  వాణిజ్య యుద్ధం కొనసాగుతుండడంతో బంగారం ధరలు వెనుతిరిగి చూడడం లేదు.