గోల్డ్ లోన్ మార్కెట్ ఐదేళ్లలో డబుల్​

  • రూ. 14.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా
  • ప్రజల దగ్గర రూ.రూ. 126 లక్షల కోట్ల విలువైన బంగారం
  • వెల్లడించిన పీడబ్ల్యూసీ ఇండియా

న్యూఢిల్లీ: మనదేశ గోల్డ్ లోన్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెండింతలు పెరిగి రూ. 14.19 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా రిపోర్ట్​ పేర్కొంది.  'స్ట్రైకింగ్ గోల్డ్: ది రైజ్ ఆఫ్ ఇండియాస్ గోల్డ్ లోన్ మార్కెట్' పేరుతో ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... 2023–-24 ఆర్థిక సంవత్సరంలో, వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధించి, రూ.7.1 లక్షల కోట్ల విలువను చేరుకుంది.  ఇది 2029 ఆర్థిక సంవత్సరం నాటికి 14.85 శాతం ఐదేళ్ల వార్షిక వృద్ధితో దాదాపు రూ. 14.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.  భారతీయ కుటుంబాల దగ్గర 25 వేల టన్నుల బంగారం ఉంది.

 దీని విలువ దాదాపు రూ. 126 లక్షల కోట్లు.  బంగారంపై లోన్లు ఇచ్చేవాళ్లు (లెండర్లు) లోన్ -టు -వాల్యూ (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీవీ) నిర్వహణ,  వేలం సంబంధిత విధానాలకు సంబంధించి కఠినమైన పరిశీలనను ఎదుర్కొంటున్నందున, వచ్చే రెండేళ్లలో బంగారు లోన్​ మార్కెట్లో కొద్దిపాటి వృద్ది మాత్రమే ఉండొచ్చు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఇచ్చిన ఆదేశం ప్రకారం.. సలహా, నగదు పంపిణీ మొత్తాన్ని రూ. 20 వేలకు పరిమితం చేయడం వల్ల వినియోగదారులు అసంఘటిత రంగంవైపు చూసే అవకాశం ఉంది.   ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా అప్పులు ఇచ్చే విధానాలపైనా ఆర్​బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై నిఘా పెంచింది. కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. దీంతో ఎన్​బీఎఫ్​సీల షేర్ల ధరలు తగ్గుముఖం పట్టాయి.  

పెరిగిన ధరలు

గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన బంగారం ధరల కారణంగా ఇక నుంచి లెండర్లు వడ్డీ రేట్లు,  ధరల విషయంలో అప్రమత్తంగా ఉండొచ్చు.  బంగారం ధరలలో ఏదైనా తగ్గుదల వల్ల నష్టాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. బంగారం లోన్​ మార్కెట్ వృద్ధికి బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు కీలకం.  డిజిటల్ గోల్డ్ లోన్ అగ్రిగేటర్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బ్యాంకులు,  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు వంటివి పరిశ్రమ వృద్ధికి వెన్నెముకగా మారాయి.  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు మారుమూల ప్రాంతాలకూ వెళ్తూ కొత్త కస్టమర్లను సంపాదించుకుంటున్నాయి.    మొత్తం బకాయిల్లో 79.1 శాతం వాటాతో బంగారు రుణాలకు దక్షిణాది  ప్రధాన మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది.