రూ.85 వేల పైన గోల్డ్ ధర.. గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ఇదే..

రూ.85 వేల పైన గోల్డ్ ధర.. గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ఇదే..

న్యూఢిల్లీ: యూఎస్‌‌‌‌–చైనా మధ్య టారిఫ్ వార్ మొదలవ్వడంతో  గోల్డ్‌‌‌‌ ధరలు పెరుగుతున్నాయి.  10 గ్రాముల గోల్డ్ ధర సోమవారం  దేశ రాజధాని ఢిల్లీలో రూ.400 పెరిగి రూ.85,300 కి చేరుకుంది. రూ.85 వేలను దాటి కొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండియాలో బంగారు నగలకు డిమాండ్ పెరిగిందని, డాలర్ మారకంలో రూపాయి విలువ పడడం కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు.

వెండి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కేజీకి రూ.300 పెరిగి రూ.96 వేలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌‌‌‌లో మాత్రం 10 గ్రాముల గోల్డ్ ధర సోమవారం రూ.440 తగ్గి రూ.84,050 కి దిగొచ్చింది. వెండి ధర  కేజికి రూ. 1,07,000 పలుకుతోంది. యూఎస్‌‌‌‌–చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలవ్వడంతో  పెట్టుబడులకు సేఫ్‌‌‌‌ అయిన గోల్డ్‌‌‌‌ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారని ఎనలిస్ట్‌‌‌‌లు పేర్కొన్నారు.