
ఖమ్మం రూరల్, వెలుగు: హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌లో ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లికి చెందిన కానిస్టేబుల్దంపతులు రేగళ్ల గోపి, బీరెల్లి లక్ష్మి గోల్డ్మెడల్సాధించారు. 42.2 కిలోమీటర్ల పరుగు పందెంలో గోపి 4 .17 గంటల్లో, 21.1 కిలోమీటర్ల రేంజ్లో లక్ష్మి 2.38 గంటల్లో గమ్యాన్ని చేరుకొని, సత్తా చాటారు. గోపి గన్‌మెన్‌గా, లక్ష్మీ తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొనగా, గోపి దంపతులు గోల్డ్మెడల్సాధించడంతో వారి స్వస్థలమైన మద్దులపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరిని రాజకీయ ప్రతినిధులతోపాటు పలువురు అభినందించారు.