ముషీరాబాద్, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఇంటర్ కాలేజీ టగ్ ఆఫ్ వార్ మెన్ టోర్నమెంట్ లో బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్‌బీఆర్ అంబేద్కర్కాలేజీ టీమ్సత్తా చాటింది. ఫైనల్మ్యాచ్లో భద్రుక కాలేజీ టీమ్‌పై గెలిచి గోల్డ్మెడల్సాధించింది. టగ్ఆఫ్వార్టోర్నమెంటులో ఓయూ పరిధిలోని వివిధ కాలేజీలకు చెందిన 8 టీములు పాల్గొన్నాయి.
ఫైనల్మ్యాచ్లో కాకా అంబేద్కర్కాలేజీ స్టూడెంట్లు, భద్రుక కాలేజీ స్టూడెంట్లు తలపడ్డారు. అంబేద్కర్కాలేజీ స్టూడెంట్లు సత్తా చాటా గోల్డ్మెడల్సాధించారు. ముగింపు కార్యక్రమంలో యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక యాదవ్ పాల్గొని విజేత టీమ్‌కు గోల్డ్ మెడల్ తోపాటు ఓవరాల్ చాంపియన్ షిప్షీల్డ్ ను అందజేశారు. ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లను అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం అభినందించింది.