
- అడిషనల్ కలెక్టర్ రమేశ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్జిల్లా స్టూడెంట్కు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ రావడం ఎంతో గర్వకారణమని అడిషనల్ కలెక్టర్రమేశ్ కొనియాడారు. గురువారం తన ఛాంబర్లో అండర్ 15 కరాటే బ్లాక్ బెల్ట్ పోటీలో పాల్గొని గోల్డ్మెడల్, ఛాంపియన్ షిప్ సాధించిన నితన్య సిరిని అభినందించారు. అనంతరం కోచ్ నగేశ్ మాట్లాడుతూ..
రెండో అంతర్జాతీయ కరాటే పోటీలు హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జనవరి 28న జరిగియన్నారు. ఈ పోటీల్లో 30 దేశాలనుంచి మూడువేల మంది పాల్గొన్నారని చెప్పారు. మెదక్ జిల్లా నుంచి క్ పట్టణానికి చెందిన నితన్యసిరి అత్యంత ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించిందన్నారు. కార్యక్రమంలో కోచ్దినకర్, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ పాల్గొన్నారు.