
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్‌చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్ అగసార నందిని గోల్డ్ మెడల్‌తో మెరిసింది. విమెన్స్ హెప్టాథ్లాన్‌లో తను బంగారు పతకం సాధించింది. రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీలో నందిని మొత్తంగా 5526 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.