కాకా బీఆర్​ అంబేద్కర్​ లా కాలేజీ  స్టూడెంట్లకు గోల్డ్​ మెడల్స్

కాకా బీఆర్​ అంబేద్కర్​ లా కాలేజీ  స్టూడెంట్లకు గోల్డ్​ మెడల్స్

హైదరాబాద్​, వెలుగు: కాకా డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ లా కాలేజీకి చెందిన ఇద్దరు స్టూడెంట్లు గోల్డ్​ మెడల్స్​ సాధించారు. బుధవారం నిర్వహించిన ఓయూ 81వ కాన్వొకేషన్​లో ఎల్‌‌‌‌ఎల్​బీ 2017–20 బ్యాచుకు చెందిన స్టూడెంట్లు ఈ మెడల్స్​ అందుకున్నారు. హిందూచట్టంలో ట్యాలెంట్​ చూపించిన తుబా ఫాతిమా అనే స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘బుసిరెడ్డి లక్ష్మమ్మ అండ్​ బుసిరెడ్డి చెన్నప్పరెడ్డి మెమోరియాల్’  గోల్డ్​ మెడల్ పొందింది. షాఫియా బేగం అనే మరో విద్యార్థి క్రిమినల్ ​ప్రొసీజర్​ కోడ్​ విభాగంలో జస్టిస్​ ఎస్. ఓబుల్​ రెడ్డి మెమోరియల్​ గోల్డ్​ మెడల్​ను సాధించింది. గోల్డ్​ మెడల్స్​ సాధించిన స్టూడెంట్లను కాకా డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ లా కాలేజీ చైర్మన్​ వివేక్​ వెంకటస్వామి, కరస్పాండెంట్​ సరోజ వివేక్​, ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. తోటి స్టూడెంట్లకు వారు ఆదర్శంగా నిలుస్తారన్నారు.