నారసింహుడికి బంగారు చెడీలు బహూకరణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారికి హైదరాబాద్ కు చెందిన ‘మహాలక్ష్మీ గ్రూప్స్’ కంపెనీ తరఫున రూ.12 లక్షల విలువ చేసే రెండు బంగారు చెడీలు, ఐదు వెండి కలశాలు సమర్పించారు. శనివారం  మహాలక్ష్మీ గ్రూప్స్ చైర్మన్ ఇనుకొండ చంద్రారెడ్డి, డైరెక్టర్లు పురుషోత్తం, భాస్కర్, హర్షవర్ధన్ రూ.10 లక్షల వ్యయంతో బంగారు పూతగల రెండు బంగారు చెడీలు, చంద్రారెడ్డి లక్ష్మీ దంపతులు తమ ఫ్యామిలీ తరఫున మరో రూ.2 లక్షలతో 2 కిలోల వెండితో తయారు చేయించిన ఆరు కలశాలను ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు శ్రావణ్ కుమార్, గజవెల్లి అందజేశారు.

  అనంతరం దాతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు.  ఆలయ సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి, ఆలయ అర్చకులు, దాతల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..