
శంషాబాద్, వెలుగు : క్యాప్స్యూల్స్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని శంషా బాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై కి వెళ్లే ఫ్లైట్లో ప్రయాణికుడు 6 క్యాప్స్యూల్స్ రూపంలో బంగారం పేస్ట్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రెండు కిలోల బంగారం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గోల్డ్ విలువ సుమారు రూ.1.30 కోట్లు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.