
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండు వాహన సేవలకు బంగారు తాపడం చేయించారు. రూ. 24 లక్షల రూపాయలతో దాతల సహకారంతో శేష, గరుడ వాహన సేవలకు బంగారు తాపడం పూర్తయినట్లు ఈవో తెలిపారు.
సాయి పావని కన్స్ట్రక్షన్స్, గార్లపాటి పెద్ద యాదయ్య కుటుంబ సభ్యుల సహకారంతో వాహన సేవలకు బంగారు తాపడం చేయించారు. అదే విధంగా దాతలు స్వామి వారి సేవా పీఠాన్ని తయారు చేసి ఆలయానికి బహుకరించారు. హైదరాబాద్ కి చెందిన అనురాధ టీంబర్ డిపో యాజమాన్యం నాలుగు లక్షల రూపాయలతో బర్మా టెక్ తో తయారు చేసి ఆలయానికి బహుకరించారు.