ట్రంప్ ట్రేడ్ వార్.. గోల్డ్‌‌కు పెరుగుతోన్న డిమాండ్

ట్రంప్ ట్రేడ్ వార్.. గోల్డ్‌‌కు పెరుగుతోన్న డిమాండ్

న్యూఢిల్లీ: ట్రంప్ ట్రేడ్ వార్‌‌‌‌తో గోల్డ్‌‌కు డిమాండ్ పెరుగుతోంది. గ్లోబల్ మార్కెట్‌‌లో ఔన్స్ (28.34 గ్రాముల)  గోల్డ్ ధర శుక్రవారం 3 వేల డాలర్ల (రూ.2.61 లక్షల) ను దాటింది. యూఎస్‌‌ ప్రెసిడెంట్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్‌‌లు వేస్తుండడంతో ఇన్వెస్ట్‌‌మెంట్లకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. 

ఇండియాలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ (24 క్యారెట్లు) ధర  హైదరాబాద్‌‌లో శుక్రవారం రూ.1,200 పెరిగి రూ.89,780 కి చేరుకుంది. గోల్డ్ ధరలు మరింత పెరుగుతాయని, జియో పొలిటికల్ టెన్షన్లు, అధ్వాన్నంగా మారిన ఆర్థిక పరిస్థితులు, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడం వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.