
న్యూఢిల్లీ: జ్యువెలర్లు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ తగ్గడంతో సోమవారం జాతీయ రాజధానిలో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,550 తగ్గి రూ. 91,450కి చేరుకుందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ. 93 వేల వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,550 తగ్గి రూ. 91 వేల చేరుకుంది. ఇది శుక్రవారం 10 గ్రాములకు రూ. 92,550 వద్ద ముగిసింది.
ఈక్విటీ మార్కెట్, ఇతర ఆస్తుల తరగతులలో అమ్మకాలు కొనసాగుతున్నందున బంగారం ధర సోమవారం పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లో కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. వెండి ధరలు వరుసగా ఐదవ రోజు కూడా పడ్డాయి. శుక్రవారం ముగింపు స్థాయి నుంచి కిలోకు రూ. 3,000 తగ్గి కిలోకు రూ. 92,500కి చేరుకున్నాయి. గత ఐదు సెషన్లలో దీని ధర రూ. 10,500 తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సు (28.3 గ్రాములు) ధర 10.16 డాలర్లు తగ్గి 3,027.20 డాలర్లకు చేరుకుంది.