Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

 పండుగ వేళ బంగారం, వెండి  కొనే వారికి గుడ్ న్యూస్.  గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ  తగ్గింది.   24  క్యారెట్ల10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.760 తగ్గగా.. 22 క్యారెట్లపై 700 తగ్గింది. గత పది రోజులుగా ఇంతగా తగ్గడం ఇదే మొదటి సారి.  మరో వైపు  కిలో వెండి ధర అక్టోబర్ 8న  లక్షా రెండు వేలు ఉండగా.. ఇవాళ  రూ 2000 తగ్గి లక్షకు  చేరింది. 

 అక్టోబర్ 8న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 77,450 ఉండగా.. రూ. 760 తగ్గి 76 ,690కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 700 తగ్గి రూ. 70, 300కి చేరింది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధరపై 760 తగ్గి రూ.76690 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 700 తగ్గి  రూ. 70,300గా ఉంది. ఢిల్లీ, బెంగళూరులోనూ ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి. 

Also Read:-హరికేన్​ మిల్టన్​ బీభత్సం.. ఫ్లోరిడాకు తుఫాను ముప్పు