న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం ధరలు సోమవారం రికార్డు స్థాయి నుంచి దిగొచ్చాయి. పది గ్రాముల ధర రూ.1,300 తగ్గి రూ.81,100కి పడిపోయిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగినది గురువారం 10 గ్రాములకు రూ. 82,400 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా అమ్మకాల ఒత్తిడిలో ఉంది. ఇది రూ. 95,000 మార్క్ దిగువకు పడిపోయింది.
కిలో ధర రూ. 4,600 తగ్గి రూ. 94,900కి పడిపోయింది. గురువారం కిలోకు రూ.99,500 వద్ద ముగిసింది. స్థానిక మార్కెట్‌లో నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి డిమాండ్ తక్కువగా ఉండడంతో బంగారం ధరపై ప్రభావం పడిందని వ్యాపారులు తెలిపారు.