- సిల్వర్ రేటు రూ.4,200 డౌన్
న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పడ్డాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 తగ్గి రూ.79,500 కి దిగొచ్చింది. గురువారం రూ.80,900 పలికింది. వెండి ధర కేజీకి రూ.4,200 తగ్గి రూ.92,400 కి పడింది. గోల్డ్‌లో 99.5 శాతం ప్యూరిటీ వేరియంట్ ధర 10 గ్రాములకు రూ.1,400 తగ్గి రూ.79,100 కి దిగొచ్చింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ (99.9 శాతం ప్యూరిటీ) రేటు శుక్రవారం రూ.600 తగ్గి రూ.78,870 పలుకుతోంది. వెండి రేటు కేజీకి రూ.3,000 తగ్గి రూ.1,01,000 వద్ద ఉంది.
ప్రాఫిట్ బుకింగ్‌తోనే..
‘ప్రాఫిట్ బుకింగ్ వలన బంగారం ధరలు పడుతున్నాయి. దీనికి తోడు యూఎస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) తగ్గడం, వీక్లీ జాబ్‌లెస్ క్లెయిమ్స్ పెరగడంతో గోల్డ్ రేటు గ్లోబల్‌గా ఔన్సుకి 2,670 డాలర్లకు దిగొచ్చింది’ అని ఎల్‌కేపీ ఎనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ రూ.76,000– రూ.78,000 రేంజ్‌లో కదలాడుతుందని ఆయన అంచనా వేశారు. సిల్వర్ కాంట్రాక్ట్ (మార్చి డెలివరీ) శుక్రవారం కేజీకి రూ.1,104 పడి రూ.91,529 వద్ద ట్రేడవుతోంది.
ALSO READ : Gold Rates today: బంగారం ధరలు తగ్గినయ్.. హైదరాబాద్లో రేట్లు ఇలా ఉన్నాయ్..
డాలర్ బలపడుతుండడం, యూఎస్ ఎకనామిక్ డేటా మిశ్రమంగా ఉండడంతో పాటు, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా గోల్డ్ ధర శుక్రవారం భారీగా పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. ఈ నెల 17–18 న ఫెడ్ మీటింగ్ ఉంది. దీనికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. ఈసారి మీటింగ్‌లో 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తారనే అంచనాలు పెరిగాయి. వచ్చే వారం జపాన్, ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉంది.