
న్యూఢిల్లీ: డిమాండ్ పెరగడంతో బుధవారం దేశ రాజధానిలో బంగారం ధర రూ.900 పెరిగి ఆల్ టైమ్ హై రూ.89,400 ను తిరిగి తాకింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాములకు రూ.88,500 వద్ద ముగిసింది.
ఫిబ్రవరి 14న, స్థానిక మార్కెట్లలో రూ.1,300 ర్యాలీ చేసి జీవితకాల గరిష్ట స్థాయి రూ.89,400 ను తాకింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధర రూ.10,010 పెరిగి రూ.89,400కి చేరుకుంది. జనవరి ఒకటో తేదీన రూ.79,390గా ఉంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రేటు రూ.900 పెరిగి రూ.89 వేలకు చేరింది. కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.99,600కి చేరుకుంది.