మరో ఆల్‌‌‌‌టైమ్ హైకి బంగారం ధర

మరో ఆల్‌‌‌‌టైమ్ హైకి  బంగారం ధర

న్యూఢిల్లీ: గ్లోబల్‌‌‌‌గా టారిఫ్ వార్ నడుస్తుండడంతో  బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌‌‌‌లో ఔన్స్ (28.34 గ్రాముల) గోల్డ్ ధర 3,115 డాలర్ల (రూ.2.67 లక్షల) ను  అధిగమించింది. కిందటి వారంలోని  శుక్రవారం సెషన్‌‌‌‌లో నమోదు చేసిన ఆల్-టైమ్ హైని  దాటింది. 

యూఎస్ ఎకానమీ రెసిషన్‌‌‌‌లోకి జారుకుంటుందనే భయాలు ఉండడంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌‌‌‌ వైపు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు వివిధ దేశాల సెంట్రల్‌‌‌‌ బ్యాంకులు గోల్డ్‌‌‌‌ను భారీగా కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్‌‌‌‌లో10 గ్రాములు బంగారం ధర సోమవారం (మార్చి 31) రూ.710 పెరిగి రూ.91,910లకు చేరుకుంది.