ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ ప్రకటనతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. దేశంలో 10 గ్రాముల బంగారం 51 వేల మార్కును తాకింది. వెండి ధరలో కూడా రెండు శాతం పెరుగుదల నమోదైంది. కిలో వెండి 65,876కు పెరిగింది. ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచమార్కెట్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంతో ట్రేడింగ్ బంగారానికి అనుకూలంగా ఉందని భావిస్తున్నారు.