న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.1,150 తగ్గి రూ.80,050 కి దిగొచ్చింది. జ్యుయెలర్స్ నుంచి డిమాండ్ తగ్గడంతో రేట్లు తగ్గాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. సిల్వర్ కేజీకి రూ.2 వేలు తగ్గి రూ.99 వేలకు పడింది.
హైదరాబాద్‌లో 99.9 శాతం ప్యూరిటీ గల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగి రూ.79,580 కి చేరుకోగా, 99.5 శాతం ప్యూరిటీ గల గోల్డ్ రేటు రూ.72,950 కి పెరిగింది. సిల్వర్ కేజీకి రూ. 1,07,000 పలుకుతోంది.