
గత మూడు రోజులుగా బంగారం ధరలుస్థిరంగా ఉన్నాయి. ఆదివారం (మార్చి 9) న స్పల్పంగా తగ్గాయి. బంగారం కొనుక్కోవాలనుకునేవారికి ఇదే మంచి సమయం. 2025 ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు..ఈ వారంలో కొద్దిగా నెమ్మదించాయి. ముఖ్యంగా గడిచిన మూడు రోజుల్లో బంగారం ధరలో చాలా స్పల్ప మార్పులే ఉన్నాయి. ఇక ఆదివారం (మార్చి9) హైదరాబాద్ తోపాటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధర పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87వేల 710 లుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80వేల 400లుగా ఉంది.
ఇక వెండి విషయానికొస్తే గత కొద్దిరోజులుగా వెండి ధర పెరుగుతూనే ఉంది. కిలో వెండి ధర రూ. లక్షకు చేరింది.. ఈ మధ్య కాలంలో స్పల్పంగా తగ్గింది. ఆదివారం కూడా వెండి ధర తగ్గింది. హైదరాబాద్ లో ఇవాళ కిలో వెండి ధర రూ. 99వేల 100గా ఉంది.
మార్చి 9న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
నగరం 22K బంగారం (ప్రతి 10 గ్రాములకు) 24K బంగారం (ప్రతి 10 గ్రాములకు)
ఢిల్లీ రూ. 80,550 రూ. 87,860
జైపూర్ రూ. 80,550 రూ. 87,860
అహ్మదాబాద్ రూ. 80,450 రూ. 80,450
పాట్నా రూ. 87,760 రూ. 87,760
ముంబై రూ. 80,400 రూ. 87,710
హైదరాబాద్ రూ. 80,400 రూ. 87,710
చెన్నై రూ. 80,400 రూ. 87,710
బెంగళూరు రూ. 80,400 రూ. 87,710
కోల్‌కతా రూ. 80,400 రూ. 87,710
మరోవైపు ప్రధాన భారతీయ నగరాల్లో స్పాట్ మార్కెట్‌లో వెండి ధరలు కిలోకు రూ.99,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర పెరగడానికి కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు ,మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధానంగా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలు కలిసి దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. భారతదేశంలో బంగారం సాంప్రదాయం, ఆర్థికంగా చాలా ముఖ్యమైనది. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. వేడుకలు, వివాహాలు, పండగలకు స్త్రీలు, పురుషులు బంగారం ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు.
నిరంతరం మారుతున్న మార్కెట్ పరిస్థితులతో, ఇన్వెస్టర్లు, బిజినెస్ పర్సన్లు హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తారు. డైనమిక్ ట్రెండ్‌లను సమర్థవంతంగా నావిగేట్ చేయడానికి ఎప్పుడూ అప్డేట్ గా ఉండటం చాలా ముఖ్యం.
ALSO READ | కూతురికి తన వాటాల్లో 47 శాతం గిఫ్ట్.. హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్‌నాడార్ నిర్ణయం