
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు కూడా మళ్లీపెరిగాయి. ఈఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగు తూనే వస్తున్నాయి. దాదాపు గడిచిన రెండు నెలల్లో 8శాతం ధరలు పెరిగాయి. మంగళవారం (ఫిబ్రవరి25) కూడా బంగా రం ధర 220 రూపాయలు పెరిగి సామాన్యులకు అందని స్థితికి వెళ్లిపోతోంది. ఇలా పెరుక్కుంటూ పోతే మరో రెండు నెలల్లో లక్ష దాటేలా ఉంది. మంగళవారం 10గ్రాముల 22 క్యారెట్ల (తులం) బంగారం ధర 80వేల 750 రూపాయులండగా..10గ్రాముల 24క్యారెట్ల (తులం) బంగారం ధర రూ.88వేల 090లకు చేరింది.
ఇక హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల 10గ్రాముల (తులం) బంగారం ధర రూ. ధర 80వేల 750 రూపా యలుండగా..10గ్రాముల 24క్యారెట్ల (తులం) బంగారం ధర రూ.88వేల 090లకు చేరింది.
ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలతో దేశీయ బంగారం ధరలు ప్రభావితమవుతాయి.