
బంగారం ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. రెండు రోజల క్రితం 73 వేలకు దిగువన ఉన్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే (సెప్టెంబర్ 13న)10 గ్రాముల బంగారంపై ధర రూ. 1200 పెరగగా..ఇవాళ సెప్టెంబర్ 14న మరో 440 పెరిగి 74, 890కి చేరింది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74వేల 890 కి చేరుకుంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74వేల 450 ఉండగా.. 440 రూపాయలు పెరిగింది. 22 క్యారెంట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68వేల 650 కి చేరింది.. సెప్టెంబర్ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 250 ఉండగా.. ఇవాళ 440 రూపాయలు పెరిగింది.
ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 95వేలుగా ఉంది