మూడో రోజు తగ్గిన గోల్డ్ ధరలు

మూడో రోజు తగ్గిన గోల్డ్ ధరలు

న్యూఢిల్లీ: ఇండియాలో గోల్డ్ రేట్లు వరుసగా మూడో రోజు తగ్గాయి. అంచనావేసిన దానికంటే మెరుగ్గా అమెరికా ఎంప్లాయిమెంట్ డేటా ఉండటం, డాలర్ బలపడటంతో, గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. ఎంసీఎక్స్‌‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.50,690గా రికార్డయింది. ఈ మూడు రోజుల్లో గోల్డ్ 10 గ్రాములకు రూ.800 తగ్గింది. ఈ నెల ఐదున రూ.56,200 వద్ద గరిష్టస్థాయులను తాకిన గోల్డ్ ధర.. అప్పటి నుంచి పోల్చుకుంటే రూ.5,500 మేర దిగొచ్చింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా ఎంసీఎక్స్‌‌లో కేజీకి రూ.67,481 వద్ద సెటిలైంది. గరిష్టస్థాయుల నుంచి సిల్వర్ రేట్లు కూడా రూ.10 వేల మేర పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఒక ఔన్స్‌‌కు 1,940 డాలర్ల వద్ద ఫ్లాట్‌‌గా ఉన్నాయి. తాజాగా విడుదలైన అమెరికా పేరోల్ డేటా ప్రకారం ఆగస్ట్ నెలలో 1.371 మిలియన్ జాబ్స్ వచ్చాయి. అన్‌‌ఎంప్లాయ్‌‌మెంట్ రేటు 8.4 శాతం తగ్గింది. మెరుగైన జాబ్స్ డేటాతో అమెరికా డాలర్ బలపడింది. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ఈ ఏడాది 25 శాతం వరకు లాభపడింది. కరోనా వైరస్‌‌తో గ్లోబల్ ఎకానమీ పడిపోవడం, సురక్షితమైన అసెట్‌‌గా గోల్డ్‌‌కు డిమాండ్ పెరగడంతో రేట్లు బాగా పెరిగాయి.

For More News..

స్టూడెంట్లకు ఓయో డిస్కౌంట్లు

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే

అడిగినోళ్లందరికీ కరోనా టెస్టులు