రికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ఒకేసారి ఇంత పెరిగిందేంటయ్యా..!

రికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ఒకేసారి ఇంత పెరిగిందేంటయ్యా..!

బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. బులియన్ మార్కెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం పది గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్ను దాటింది. ఇవాళ (అక్టోబర్ 23, 2024) బంగారం ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.

Goodreturns.in ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.80,220కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.73,550 పలికింది. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఇలా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధర ఆకాశాన్నంటేందుకు కారణం అయ్యాయి. 

ALSO READ | 2025లో జీడీపీ గ్రోత్​ 7.2 శాతం: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్​

ఒక్క బంగారం మాత్రమే కాదు.. వెండి కూడా రికార్డ్ ధర పలికింది. బుధవారం నాడు కిలో వెండి ధర 1,04,000 రూపాయలకు చేరుకుంది. పండుగ టైమ్‌‌లో డిమాండ్, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరగడంతో పాటు మిడిల్‌‌ ఈస్ట్‌‌లో కొనసాగుతున్న టెన్షన్లు కూడా కారణం అని ఎనలిస్టులు చెబుతున్నారు.