
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ వల్ల ఢిల్లీలో గురువారం పది గ్రాముల బంగారం రూ.1,150 తగ్గి రూ.88,200లకు పడిపోయింది. 99.5 శాతం స్వచ్ఛత గల పుత్తడి ధర రూ.87,500లకు పడిపోయిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
కిలో వెండి ధర రూ.వెయ్యి తగ్గి రూ.98,500లకు చేరుకుంది. శివరాత్రి కారణంగా బులియన్మార్కెట్లు బుధవారం ఓపెన్ కాలేదు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్టుల ధర పది గ్రాములకు రూ.554 తగ్గి రూ.85,320లకు పడిపోయింది.