హైదరాబాద్: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో బంగారం ధర శుక్రవారం(డిసెంబర్13) కాస్తంత ఊరట కలిగించింది. డిసెంబర్ 13న 24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు తగ్గింది. దీంతో.. డిసెంబర్ 12న రూ.79,470 ఉన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర డిసెంబర్ 13న 78,870 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర గురువారం(డిసెంబర్ 12, 2024) 72,850 రూపాయలు ఉండగా.. శుక్రవారానికి ఈ ధర రూ.72,300కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం 550 రూపాయలు తగ్గింది.
ఇక.. ఈ రెండు వారాల్లో.. డిసెంబర్ 1 నుంచి 13 వరకూ హైదరాబాద్లో బంగారం ధరలను పరిశీలిస్తే స్వల్పంగా పెరిగాయి. డిసెంబర్ 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,000 రూపాయలు ఉండగా, డిసెంబర్ 13న 78,870 రూపాయలకు చేరింది. అంటే.. డిసెంబర్ 1తో పోల్చితే డిసెంబర్ 13 నాటికి బంగారం ధర 870 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం కూడా డిసెంబర్ 1న 71,500 ఉండగా.. డిసెంబర్ 13న 72,300 ధర వద్ద కొనసాగుతోంది. ఈ 13 రోజుల్లో 800 రూపాయలు పెరిగింది.
ALSO READ | మరింత పడిన రూపాయి విలువ
వాస్తవానికి శుక్రవారం బంగారం ధరలు తగ్గినప్పటికీ డిసెంబర్ నెల ఓవరాల్గా చూసుకుంటే బంగారం ధర పెరిగిందనే చెప్పాలి. ఇక.. వెండి ధరల విషయానికొస్తే.. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధరపై 3 వేల రూపాయలు తగ్గింది. డిసెంబర్ 12న కిలో వెండి ధర రూ.1,04,000 ఉండగా.. డిసెంబర్ 13న 1,01,000 రూపాయలుగా ఉంది.
ఎకనమిక్ స్లోడౌన్, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రెసిషన్ సమయాల్లో పుత్తడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. స్టాక్స్, బాండ్లు, కరెన్సీల్లో రాబడులు తగ్గినా విలువ పెరుగుతుంది.