
బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా పసిడి ధర తగ్గుతూ వస్తోంది. నిన్న తులం బంగారం 270 రూపాయలు తగ్గిన గోల్డ్రేట్..ఇవాళ(ఫిబ్రవరి 27) మరోసారి తగ్గింది.బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదొక అవకాశం. రానున్న రోజుల్లో బంగారం ధరలు లక్ష దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురువారం (ఫిబ్రవరి27) హైదరాబాద్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87వేల 810 లకు చేరింది. అదే 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 80వేల 490లుగా ఉంది. నిన్నటి ధరలతో పోల్చితే ఇది చాలా స్పల్పంగా 10రూపాయలు తగ్గింది.