బంగారం మళ్లీ పిరమైంది. పసిడి రేటు రెండేళ్ల గరిష్టానికి చేరింది. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువ రేటు పలుకుతోంది. ఈ రోజు తులం బంగారం ధర రూ.55,546గా ఉండగా.. కిలో వెండి రేటు 1.4శాతం పెరిగి రూ.70,573గా రికార్డైంది. 2020 ఆగస్టులో బంగారం ధర అత్యధికంగా రూ.56,500గా పలికింది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ రేటు 0.8శాతం పెరిగి 1,838.69 డాలర్లకు చేరింది.
2022 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు 10శాతం పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో తులం రేటు రూ.50 వేల నుంచి రూ.55 వేల వరకు పలికింది. రేటు పెరిగేందుకు డాలర్ విలువ పడిపోవడం కారణమేనని రిసెర్చ్ అనలిస్టులు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే 2023లో బులియన్ మార్కెట్ ఆశాజనకంగా మారతుందని చెబుతున్నారు.