ఇలా అయితే కొనడం ఎలా: భారీగా పెరిగిన బంగారం..

ఇలా అయితే కొనడం ఎలా:  భారీగా పెరిగిన బంగారం..

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు దేశరాజధానిలో సోమవారం రూ.1,300 చొప్పున పెరిగాయి. యూఎస్​ టారిఫ్​లపై అనిశ్చితి కారణంగా పుత్తడికి డిమాండ్​ పెరుగుతోంది.  గ్లోబల్​ఎకానమీలో ఒడిదుడుకుల కారణంగా సెంట్రల్​బ్యాంకులు కూడా భారీగా బంగారం కొంటున్నాయి. 

99.9 స్వచ్ఛత గల బంగారం ధర రూ.90,750లకు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర లైఫ్​టైం హై రూ.90,350లకు దూసుకెళ్లింది. కిలో వెండి ధర రూ.1.02 లక్షలకు చేరింది.