పసిడి కొనాలకునేవారికి షాకింగ్ న్యూస్.. హైదరాబాద్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ సంవత్సరంలోనే ఇంతగా ఎన్నడు బంగారం ధరలు లేవు. మంగళవారం (జూలై 16) 24 క్యారెట్ల10గ్రాముల బంగారం ధర రూ.75,570 చేరుకుని ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. గడిచిన నాలుగు నెలల్లో పసిడి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి.
2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు గరిష్టంగా 75వేల కు చేరుకోగా కనిష్టంగా 72వేలగా నమోదు అయింది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు 72 వేల వద్ద గోల్డ్ ధర స్థిరంగా ఉంది. ఏప్రిల్ లో బంగారం ధరలు రూ. 74వేల 340 ఉండగా.. మే లో 75వేల 160కి చేరింది. తాజాగా రూ.75వేల 570 కి చేరింది. ఇదే లెక్కన పోతే ఈ ఏడాది బంగారం ధర రూ. 78వేలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ చెబుతున్నాయి.