Gold Rates Today: బంగారం ధర భారీగా తగ్గిందని సంబరపడుతుంటే ఇవాళ మళ్లీ పెరిగింది..

Gold Rates Today: బంగారం ధర భారీగా తగ్గిందని సంబరపడుతుంటే ఇవాళ మళ్లీ పెరిగింది..

భారత్లో బంగారం ధర శనివారం (27-07-2024) నాడు స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాడు (26-07-2024) రూ.63,000 ఉండగా, శనివారం ఈ ధర రూ.63,250కి చేరింది. నిన్నటితో పోల్చితే నేడు 10 గ్రాముల ధరపై 250 ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం రూ.68,730 ఉండగా శనివారం నాడు రూ.69,000 ధర పలికింది. 24 క్యారెట్ల  బంగారం ధర 10 గ్రాములపై 270 రూపాయలు పెరిగింది. సింపుల్గా చెప్పాలంటే.. భారత్లో శనివారం నాడు 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.6,325 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.6,900 పలికింది. ఇక.. దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం నాడు బంగారం ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • హైదరాబాద్- రూ.63,250 (22K Gold /10g), రూ.69,000 (24K Gold /10g)
  • చెన్నై- రూ.64,650 (22K Gold /10g), రూ.70,530 (24K Gold /10g)
  • ఢిల్లీ- రూ.63,400 (22K Gold /10g), రూ.69,150 (24K Gold /10g)
  • బెంగళూరు- రూ.63,250 (22K Gold /10g), రూ.69,000 (24K Gold /10g)
  • ముంబై- రూ.63,250 (22K Gold /10g), 69,000 (24K Gold /10g)
  • కోల్కత్తా- రూ.63,250 (22K Gold /10g), రూ.69,000(24K Gold /10g)

జులై నెలలో ఓవరాల్ గా బంగారం ధరలను పరిశీలిస్తే.. జులై 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,250 రూపాయలు ఉండగా, జులై 27 నాటికి 63,250 రూపాయలకు పతనమైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జులై 1న 72,280 రూపాయలు ఉండగా, జులై 27న 69,000కి తగ్గింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించాక బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బడ్జెట్ ప్రకటించిన రోజు కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాములపై రూ. 3 వేలకు పైగా బంగారం ధర పతనమైంది. ఇక వెండి ధరల విషయానికొస్తే.. శనివారం నాడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర శుక్రవారం నాడు రూ.84,500 ఉండగా శనివారం నాడు కూడా అదే ధర స్థిరంగా ఉంది.హైదరాబాద్ నగరంలో వెండి ధర కాస్తంత ఎక్కువగానే పలుకుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర అత్యధికంగా రూ.89,000 పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, పుణె, అహ్మదాబాద్, వడోదరలో కిలో వెండి ధర రూ.84,500గా ఉంది.