రూ.82 వేలకు చేరిన బంగారం ధర

న్యూఢిల్లీ: బంగారం ధరలు వరుసగా మూడో రోజైన శుక్రవారమూ పెరిగాయి. ఢిల్లీలో పది గ్రాముల ధర రూ.700 పెరిగి రికార్డ్​హై రూ.82 వేలకు ఎగిసింది. లోకల్​మార్కెట్ల నుంచి భారీ డిమాండ్​ కారణంగా ధరలు పెరుగుతున్నాయని ఆలిండియా సరాఫా ఆసోసియేషన్​ తెలిపింది. 99.5 శాతం ప్యూరిటీ గల పది గ్రాముల పుత్తడి ధర రూ.700 పెరిగి రూ.81,600లకు చేరింది. 

కిలో వెండి ధర మాత్రం రూ.500 తగ్గి రూ.93,500లకు పడిపోయింది. గత అక్టోబరు 31వ తేదీన 99.9 ప్యూరిటీ గల బంగారం ధర రూ.82,400లకు, 99.5 ప్యూరిటీ గల బంగారం ధర రూ.82 వేలకు చేరింది. ఇంటర్నేషనల్​మార్కెట్లలో ట్రెండ్స్​ బలహీనంగా ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్లో మాత్రం గిరాకీ తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు.