భగభగమంటున్న పసిడి, వెండి ధరలు.. తులం బంగారం రూ. 83వేలు దాటేసింది

భగభగమంటున్న పసిడి, వెండి ధరలు.. తులం బంగారం రూ. 83వేలు దాటేసింది

బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ధరలు చూస్తుంటే.. భవిష్యత్తులో బంగారం కొనడం కలగానే మిగిలిపోతుందా అన్న భయం కలుగుతోంది. తాజాగా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కోయంబత్తూర్, జైపూర్ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 83వేలు క్రాస్ చేసి ఆల్ టైమ్ హైకి చేరింది.

ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. భాగ్యనగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తులం రూ. 75,550గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు10 గ్రాములు రూ. 8,242గా ఉంది.

పొరుగు రాష్ట్రం ఏపీలోనూ ఇవే రేట్లు. విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరలు.. వంద రూపాయలు అటు ఇటుగా హైదరాబాద్ తరహాలో ఉన్నాయి. 

కిలో వెండి.. లక్షా 5వేలు

బంగారానికి తామేం తక్కువ కాదన్నట్లుగా వెండి సైతం.. పసిడి బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి ధర రూ. లక్షా 5వేలుగా ఉంది.

ఎందుకీ పెరుగుదల..?

దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. గ్లోబల్ డిమాండ్, వడ్డీ రేట్లు, ప్రభుత్వ నిబంధనలు, మదుపర్లు బంగారాన్ని పెట్టుబడిగా ఎంచుకోవడం వంటివి పెరుగుదలకు కారణాలుగా చెప్పవచ్చు. 

ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కావున, పసిడి కొనాలనే ఆలోచనలో ఉన్న వారు ఇప్పుడే తీసుకోవడం మంచింది. పెరిగాక.. అయ్యో అప్పుడు తీసుకున్నా బాగుండేదే అన్న నిరాశకు గురి కాకుండా ఉండవచ్చు.