బంగారం ఆల్ టైం రికార్డ్ ధరకు చేరింది... శుక్రవారం ( జనవరి 24, 2025 ) ఇండియన్ మార్కెట్లో రూ. 83వేల ఆల్ టైం హై ధరను క్రాస్ చేసింది బంగారం. కోయంబత్తూర్, జైపూర్ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 83వేలు క్రాస్ చేసి ఆల్ టైం హైకి చేరింది.. శుక్రవారం సాయంత్రం సమయానికి కోయంబత్తూర్ లో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 83 వేల 60గా ఉండగా.. జైపూర్ లో రూ. 83 వేల 140గా నమోదయ్యింది.
హైదరాబాద్ మార్కెట్:
ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. గురువారం ( జనవరి 23, 2025 ) కాస్త పెరిగిన బంగారం శుక్రవారం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను శుక్రవారం రూ. 75 వేల240 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 82 వేల 80గా ఉంది.
దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో 10 గ్రాములకు గాను బంగారం ధర
నగరం 22 క్యారెట్లు 24 క్యారెట్లు
బెంగళూరు: రూ.75,240, రూ. 82,080
భవనేశ్వర్: రూ.75,240, రూ.82,080
ముంబై : రూ.75,240, రూ.82,080
ఢిల్లీ: రూ.75,390 రూ.82,230
కోల్‌కతా: రూ.75,240, రూ.82,080
విజయవాడ: రూ.75,240, రూ.82,080
చెన్నై: రూ.75,240, రూ.82,080