రికార్డ్ స్థాయికి బంగారం ధరలు .. గోల్డ్ @​ రూ.81వేల 500

రికార్డ్ స్థాయికి బంగారం ధరలు .. గోల్డ్ @​ రూ.81వేల 500

న్యూఢిల్లీ:  దేశ రాజధానిలో బుధవారం బంగారం, వెండి ధరలు ఆల్​టైం హైకి చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం..బంగారం ధరలు రూ.500 ఎగబాకి 10 గ్రాములకు రూ.81,500కి చేరుకోగా, కిలో వెండి రూ.1,000 పెరిగి రూ.1.02 లక్షలకు చేరుకుంది.  99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు వరుసగా రూ.500 పెరిగి 10 గ్రాములు రూ.81,500లకు, 10 గ్రాములు రూ.81,100లకు చేరాయి.  వెండి ధర మంగళవారం కిలోకు రూ. 1.01 లక్షల నుంచి రూ. 1,000 పెరిగి తాజా గరిష్ట స్థాయి రూ.1.02 లక్షలకు చేరుకుంది.  గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో వెండి ధర కిలోకు రూ.10 వేలు పెరిగింది.