
గత కొన్ని నెలలుగా బంగార ధర విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా 2025 ప్రారంభం నుంచి మరింత పెరుగుతూ వస్తుంది. 2025 జనవరి కంటే ముందు సుమారు 78వేల రూపాయలున్న బంగారం ధర.. ఫిబ్రవరి ఎండింగ్ నాటికి 87వేలు దాటింది. అంటే 10 శాతం పెరిగింది. ఈ భారీ పెరుగుదల ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. పెరుగుదలకు కారణాలను వెతికేలా చేసింది. ప్రస్తుతం బంగారం ధరను అర్థం చేసుకునేందుకు , బంగారం మార్కెట్ ను ప్రభావితం చేస్తున్న అంశాలను పరిశీలించాలి.
భారతీయులు బంగారాన్ని బాగా ఇష్టపడతారు. ఆభరణాలకోసం కొనుగోలు చేస్తే.. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అందువల్ల బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. బంగారం దిగుమతిలో భారత్ రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది.
ఇక బంగారం ధరలు గత పదేళ్లలో ఎలా ఉన్నాయి.. ప్రతి యేటా ఎలా పెరుగుతూ వచ్చాయనేది పరిశీలిస్తే.. గత పదేళ్లలో బంగారం ధర దాదాపు రూ. 60వేలు పెరిగింది. అంటే సంవత్సరానికి సుమారుగా 7వేలు పెరిగింది. 2015లో 24వేల 931 రూపాయలున్న బంగారం ధర రూ. 2025 మార్చి1నాటికి 86వేల830లకు చేరింది. 2001నుంచి 2014 మధ్య కాలంలో బంగారం ధలు ఇంతలా పెరగలేదు. పదిహేనేళ్లలో 20వేలు అంటే సంవత్సరానికి వెయ్యి మాత్రమే పెరిగింది.
2025 (మార్చి1 ): రూ 86వేల830
2024: రూ 78వేల245
2023: రూ 63వేల203
2022: రూ 55 వేల017
2021: రూ 48వేల099
2020: రూ 50వేల151
2019: రూ 39వేల108
2018: రూ 31వేల391
2017: రూ 29వేల156
2016: రూ 27వేల445
2015: రూ 24వేల931
బంగారు మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు:
సరఫరా ,డిమాండ్: మైనింగ్ ఉత్పత్తి మార్పులు, రీసైక్లింగ్,పారిశ్రామిక వినియోగం
సెంట్రల్ బ్యాంక్ విధానాలు: సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు లేదా అమ్మకాలు, ద్రవ్య విధానాలు ,వడ్డీ రేటు చర్యలు
ద్రవ్యోల్బణం,ప్రతి ద్రవ్యోల్బణం: కరెన్సీ తరుగుదల సమయంలో బంగారం పెరుగుతుంది కాబట్టి దానిని ద్రవ్యోల్బణ హెడ్జ్‌గా కూడా చూస్తారు.
రూపాయి విలువ: అమెరికా డాలర్‌తో పోలిస్తే పెద్ద కరెన్సీల బలంలో మార్పులు
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: పొలిటికల్ క్రైసిస్, వివాదాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం డిమాండ్ ను పెంచుతాయి.
వడ్డీ రేట్లు: వడ్డీ రేటు మార్పులు బంగారం నిల్వ అవకాశాల ఖర్చును ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇన్వెస్టర్ల డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయి.
మార్కెట్ సెంటిమెంట్ ,స్పెక్యులేషన్: పెట్టుబడిదారుల సెంటిమెంట్ ,స్పెక్యులేటివ్ చర్యలు స్వల్పకాలంలో బంగారం ధరలను గణనీయంగా పెరుగుతాయి.