Gold Rate పసిడి పరుగులు.. హైదరాబాద్లో రూ. 88 వేలకు చేరువైన తులం

Gold Rate పసిడి పరుగులు.. హైదరాబాద్లో  రూ. 88 వేలకు  చేరువైన తులం

రోజురోజుకు బంగారం ధరలు జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. గత వారం రోజుల్లోనే దాదాపు  4 వేలు పెరిగింది.   పెళ్లిళ్ల సీజన్..రూపాయి విలువ పడిపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

ఫిబ్రవరి 10న హైదరాబాద్, విజయవాడలో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,060 ఉండగా..ఇవాళ ఫిబ్రవరి 11న తులానికి 870 పెరిగి రూ. 87,930 కి చేరింది.  

ఇక ఫిబ్రవరి 10న 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,800 ఉండగా..ఇవాళ రూ. 800 పెరగడంతో రూ. 80,600కు చేరింది. మరో వైపు కిలో వెండి లక్షా 7 వేలుగా ఉంది.   ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 870 పెరగడంతో 88,080కి చేరింది. 

ALSO READ | చైనా డీప్ సీక్తో ప్రమాదమా..త్వరలో ఇండియాలో డీప్ సీక్ బ్యాన్?..ప్రభుత్వం ఏమంటుందంటే..

పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు అనూహ్యంగా పెరగడంతో సామాన్యులు తిప్పలు పడ్తున్నారు. నిజానికి జనవరి 30న మాఘమాసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో లక్షలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. తెలుగిండ్లలో బంగారం లేకుండా పెళ్లిళ్లు జరగవంటే అతిశయోక్తి కాదు. ఆయా కుటుంబాలు తాహతును బట్టి పెళ్లి కూతుర్లకు, ఆడపడుచులకు తులాల కొద్దీ  బంగారు ఆభరణాలు కొనడం ఆనవాయితీ. కానీ పెరిగిన గోల్డ్​ రేట్లతో వధువుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు.