బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. సామాన్యులకు అంతనంత ఎత్తులో ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలో 82 వేల మార్క్ దాటింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. లక్ష మార్క్ ను చేరొచ్చంటున్నారు.
గడిచిన రెండు నెలల్లో బంగారం ధరలు అప్పుడప్పుడు తగ్గుతున్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే.. ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండు నెలల క్రితం 24 క్యారెట్ల బంగారం ధర 70వేల మార్క్ లో ఉండగా.. కొత్త ఏడాది ప్రారంభంలో 82వేల మార్క్ ను దాటింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బం గారం కొనాలనుకుంటుంటారు.. మరొకొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు..అలాంటి వారికి బంగారం ధరల పెరుగుదల నిరాశకలిగిస్తోంది..
శుక్రవారం నాడు హైదరాబాద్ లో సహా దేశంలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం ధరలు తగ్గాయి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 620 రూపాయలు తగ్గి రూ.82వేల080లకు చేరింది. గురువారం ఈ ధర రూ. 82వేల 700లుగా ఉంది.మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. గురువారం కిలో వెండి ధర రూ. 93వేల 920 ఉండగా.. శుక్రవారం రూ. 1లక్షా 3వేల 900లకు చేరింది.