భగ్గుమంటున్న బంగారం.. 1150 రూపాయలు పెరిగింది.. తులం ధర ఎంతైందంటే..

భగ్గుమంటున్న బంగారం.. 1150 రూపాయలు పెరిగింది.. తులం ధర ఎంతైందంటే..

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి ధర ఇవాళ రాకెట్లా దూసుకుపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర 1150 రూపాయలు పెరిగి బంగారం కొనాలనే ప్లాన్లో ఉన్న వినియోగదారులు కంగుతినేలా చేసింది. సోమవారం 84,050 రూపాయలు ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1150 రూపాయలు పెరగడంతో 85,200 రూపాయలకు చేరింది. గ్రాముపై 115 రూపాయలు పెరగడంతో పసిడి ప్రియులు విస్మయం వ్యక్తం చేశారు. రోజుకు వెయ్యి రూపాయలు పెరుగుతూ పోతే.. బంగారం కొనడం అటుంచి గోల్డ్ షాపుల్లో చూస్తూ గడిపేసే రోజులొస్తాయేమోనని వినియోగదారులు భావిస్తున్నారు.

22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై 1050 రూపాయలు పెరిగింది. దీంతో.. 77,050 రూపాయల నుంచి 78,100 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. కొత్త సంవత్సరంలో శుభకార్యాలు మొదలవడంతో బంగారానికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఇవాళ (ఫిబ్రవరి 4, 2025) బంగారం ధర వెయ్యి రూపాయలకు పైగా పెరిగి వినియోగదారులకు షాకిస్తే.. వెండి మాత్రం కాస్తంత తగ్గి ఊరటనిచ్చింది. కిలో వెండిపై వెయ్యి రూపాయల ధర తగ్గింది. దీంతో.. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,06,000 రూపాయలు పలికింది.

ALSO READ : రూ.85 వేల పైన గోల్డ్ ధర.. గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ఇదే..

ఇండియాలో బంగారు నగలకు డిమాండ్ పెరిగిందని, డాలర్ మారకంలో రూపాయి విలువ పడడం కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇండియాలో బంగారు నగలకు డిమాండ్ పెరిగిందని, డాలర్ మారకంలో రూపాయి విలువ పడడం కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు.