పార్లమెంట్ లో 2024 - 25 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గోల్డ్ పై కస్టమ్ ట్యాక్స్ ను 15 నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో ఇండియాలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. మళ్లీ ఇప్పుడు నెమ్మదిగా బంగారం రేట్లు పెరగుగున్నాయి. జూలై 29న 22 క్యారెట్స్ తులం బంగారం విలువ రూ.63వేల 400, 24 క్యారెట్స్ రూ.69 వేల 160 లుగా ఉంది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.400 లు పెరిగింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ తర్వాత 22 క్యారెట్ 10 గ్రాముల (తులం) గోల్డ్ రూ.63,000, 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ.68,730లకు పడిపోయింది.