హైదరాబాద్లో తగ్గిన తులం బంగారం ధర.. రూ. 87,980 నుంచి ఎంతకు పడిపోయిందంటే..

హైదరాబాద్లో తగ్గిన తులం బంగారం ధర.. రూ. 87,980 నుంచి ఎంతకు పడిపోయిందంటే..

గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం ధరలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 490 రూపాయలు తగ్గింది. దీంతో.. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 87,980 రూపాయల నుంచి 87,490 రూపాయలుకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 450 రూపాయలు తగ్గి 80,650 రూపాయల నుంచి 80,2000కు పడిపోయింది.

2025, మార్చి నెలలో ఈ ఆరు రోజుల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. మార్చి 1న 220 రూపాయలు తగ్గింది. మార్చి 2, మార్చి 3న బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మార్చి 4న బంగారం ధర భారీగా పెరిగింది. తులంపై 760 రూపాయలు పెరిగింది. మార్చి 5న కూడా 600 రూపాయలు పెరిగింది. మార్చి 6న 490 రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా ఇవాళ వెయ్యి రూపాయలు పెరిగి కిలో లక్షా 8 వేల రూపాయలకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడూ బంగారానికి డిమాండ్ పెంచేస్తుంటాయి. ఆర్థిక మాంద్యం పెరగటంతో పెట్టుబడిదారులు పసిడిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రధానంగా స్టాక్ మార్కెట్లో విలువైన మెటల్స్కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. బులియన్ వర్గాలు కూడా ప్యూచర్ కాంట్రాక్టుల్లో భాగంగా.. గోల్డ్లో పెట్టుబడులకు ఆసక్తిని చూపుతారంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రూపాయి మారకం రేటుకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగటం, తగ్గటం జరుగుతుంటాయి. 

ప్రధానంగా ఇన్ ఫ్లేషన్స్ పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల కోసం గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరడం వంటి కారణాలతో ధరలు పెరుగుతూ వస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ అధికమవటంతో.. అంతర్జాతీయ కమోడిటీస్ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎగబాకాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న క్రూడాయిల్, నిత్యావసర ధరలతో పాటు బంగారం ధరలు కూడా ప్రస్తుతం బాటలో ఉన్నాయి.