కొత్త సంవత్సరం మొదలై గట్టిగా మూడు రోజులయింది. ఇవాళ జనవరి 3, 2024. ఊహించని రీతిలో ధర పెరిగి బంగారం కొత్త సంవత్సరంలో పెద్ద ఝలక్ ఇచ్చింది. 2025లో కొందరు పెళ్లిళ్లకు, శుభ కార్యాలకు సిద్ధమయ్యారు. బంగారం ధర తగ్గుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి ఆశలను బంగారం ఆవిరి చేసింది. జనవరి 3న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా 870 రూపాయలు పెరిగింది.
జనవరి 2న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,330 రూపాయలు ఉండగా జనవరి 3న 79,200 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై 800 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలివి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర దాదాపుగా ఇంతే ఉంది.
ALSO READ | పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..
ఇక.. 2025లో ఈ మూడు రోజుల్లో బంగారం ధరల ట్రెండ్ ను గమనిస్తే.. ‘తగ్గేదేలే’ అనే రీతిలో పెరుగుతూ పోతుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై జనవరి 1న 440 రూపాయలు పెరిగింది. జనవరి 2న 330 రూపాయలు పెరిగింది. జనవరి 3న 870 రూపాయలు పెరిగి 80000 రూపాయలకు చేరువ అయింది. ఇలానే పెరుగుతూ పోతే.. బంగారం ధర జనవరి నెలాఖరు నాటికి 85 వేల నుంచి 90 వేల వరకూ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక.. వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి ధర జనవరి 2న 98,000 రూపాయలు ఉండగా.. జనవరి 3న 2 వేలు పెరిగి కిలో వెండి ధర లక్షకు చేరింది.