న్యూఢిల్లీ: గోల్డ్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) ని ప్రభుత్వం 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల గోల్డ్ ధర రూ.72,833 దగ్గర మంగళవారం ఓపెన్ కాగా, ఇంట్రాడేలో రూ.68,500 కి పడింది. ఈ ఒక్క సెషన్‌లో పది గ్రాముల గోల్డ్ రేటు రూ.4,200 తగ్గింది. సెషన్ చివరిలో కొనుగోళ్లు జరగడంతో బంగారం ధర కొంత కోలుకుంది.
ALSO READ : ఉద్యోగులకు ఊరట కొంచమే
కొత్త కస్టమ్స్ డ్యూటీ రేట్లకు తగ్గట్టు మార్కెట్ అడ్జెస్ట్ అయ్యిందని కమోడిటీ ఎక్స్‌పర్ట్‌లు పేర్కొన్నారు. గోల్డ్‌కు రూ.68 వేల దగ్గర సపోర్ట్ ఉందని అన్నారు. కేజీ సిల్వర్‌కు రూ. 80 వేల దగ్గర సపోర్ట్ ఉందని
తెలిపారు.