పసిడి ప్రియులకు షాక్.. తులం బంగారం రూ.60 వేలు

బంగారం కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిచ్చాయి. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరగుతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 150 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 170 రూపాయలు పెరిగాయి.  దీంతో తులం బంగారం ధర రూ.60 వేలకు చేరుకుంది. ఈ క్రమంలో సమాన్య జనాలు బంగారం వైపు చూడాలంటనే భయపడిపోతున్నారు.2024, మార్చి 8వ తేదీశుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,250గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,730కి చేరుకుంది. కిలో వెండి ధరపై 500 రూపాయలు పెరిగి.. రూ.75,500గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,400గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,880కి చేరుకుంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,250గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,730కి చేరుకుంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,250గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,730కి చేరుకుంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,050గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600కి చేరుకుంది.