
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త..బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఆదివారం (మార్చి 2) పసుపు లోహం(బంగారం) ధర 210రూపాయలు తగ్గింది. 10గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర(తులం) రూ. 86వేల 793లకు చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) రూ. 190 లు తగ్గి రూ. 79వేల 573కి చేరింది.
గతవారం రోజులు గోల్డ్ రేట్ తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. 24 క్యారెట్ల బంగారం ధర హెచ్చుతగ్గులు 0.45శాతంగా నమోదయ్యాయి. గత నెలలో మార్పు -3.4శాతంగా ఉంది.మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర లక్ష దాటింది.
హైదరాబాద్‌లో బంగారం ధర
హైదరాబాద్‌లో నిన్న రూ. 86వేల 439గా ఉన్న 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..ఆదివారం రూ. 86వేల 649లకు చేరింది. అదే విధంగా చెన్నైలో 86వేల 641గాను, బెంగళూరులో రూ. 86వేల 635, విశాఖపట్నం లో రూ. 86వేల 657, విజయవాడలో 86వేల 655గా గోల్డ్ రేట్ కొనసాగుతోంది.